కొసమెరుపు: జగన్ – పవన్… మధ్యలో ఎంపీపీ!

-

తాజాగా ఏపీలో విడుదలైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది అధికార పార్టీ! మొత్తంగా పరిషత్ ఎన్నికల వేళ.. టీడీపీ చేతులు ఎత్తేయటం, వైసీపీకి అడ్డు లేకుండా పోవడం ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో పెద్దగా బలం లేని జనసేన.. రాష్ట్ర వ్యాప్తంగా 180 స్థానాల్ని గెలుచుకోవటం గమనార్హం! ఈ క్రమంలో జనసేన – వైకాపా కు మధ్య ఒక ఎంపీపీ పదవి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

jagan pawawn kalyan

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండల జెడ్పీ స్థానంతో పాటు.. అత్యధిక ఎంపీటీసీ స్థానాల్ని జనసేన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న (శుక్రవారం) జరిగే మండలాధ్యక్ష పదవిని దక్కించుకోవాడానికి రెడీ అయ్యింది. అయితే… మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని, ఫలితంగా తమ పార్టీ నేతల కుటుంబాల మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చి.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పవన్ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో… న్యాయంగా తాము గెలుచుకున్న కడియం ఎంపీటీసీని తమకు చెందకుండా అధికార పార్టీ అడ్డుకుంటే మాత్రం.. తాము తీవ్రంగా పోరాడతామని.. అవసరమైతే ఆ రోజు తానే స్వయంగా రంగంలోకి దిగి కడియంలో అడుగుపెడతానని.. అవసరమైతే కేంద్ర హోంశాఖకు కంప్టైంట్ చేస్తానని చెబుతున్నారు పవన్ కల్యాణ్. దీంతో… ఇప్పుడు కడియం ఎంపీపీ సీటు హాట్ టాపిక్ గా మారింది.

అయితే… ఈ సీటుపై స్థానిక వైకాపా నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ కడియం మండలాధ్యక్ష పదవిని దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తుందంట. అధికారపార్టీకి అనుకూలంగా ఉంటే నిధులు వస్తాయని.. ప్రతిపక్షంలో ఒంటరిగా ఉండి చేసేదేముందని కొందరు ఎంపీటీసీలు ఆలోచిస్తున్నారట! ఇదే నిజమైతే మాత్రం… కొందరు ఎంపీటీసీలు స్వచ్చందంగా ఫ్యాన్ కు సై అంటే మాత్రం… అది కూడా జగన్ ఖాతాలో పడిపోవడం పక్కా!

ఈ క్రమంలో అదే జరిగితే పవన్ కూడా రంగంలోకి దిగుతారని చెప్పడం మరీ హాట్ టాపిక్ అయ్యింది. అదేజరిగితే నిజంగా పవన్ రంగంలోకి దిగుతారా.. కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తారా అనంది ఆసక్తిగా నెలకొంది.

గత ప్రభుత్వ హయాంలో “23మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పసువులను కొన్నట్లుగా కొన్నప్పుడు… పవన్ స్పందించలేదు. ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ… ఇప్పుడు తనవరకూ వచ్చేసరికి.. సెంట్రల్ హోం మినిస్టర్ కు ఫిర్యాదు చేస్తాననే స్థాయిమాటలు మాట్లాడుతున్నారు” అనే కామెంట్లు ఈ సందర్భంగా కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Latest news