ఏపీలో షర్మిల.. జగన్ స్టాండ్ ఇదేనా?

-

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి షర్మిల..వైఎస్సార్టీపీ పేరిట ఒక పార్టీ పెట్టి రాజకీయం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే షర్మిల రాజకీయంగా మాత్రం బలపడలేకపోతున్నారు. ఏదో నిదానంగా తన పని తాను చేసుకుని వెళుతున్నారు. ఇక అటు ఏపీలో షర్మిల అన్న జగన్ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే షర్మిల విషయంలో జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ అసలు స్పందించడం లేదు.

కానీ అప్పుడప్పుడు మాత్రం షర్మిల..పరోక్షంగా జగన్ యాంటీగానే గళం విప్పినట్లు కనిపించారు. ఇక దాన్ని టీడీపీ అనుకూల మీడియా ఓ రేంజ్‌లో ప్రచారం చేసేసుకుంటుంది. జగన్-షర్మిలల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, వారికి ఆస్తి గొడవలు ఉన్నాయని, ఇటీవల ఇడుపులపాయ వచ్చినా సరే వారు మాట్లాడుకోలేదని తెగ ప్రచారం చేసేస్తున్నారు. అలాగే తాజాగా ఏపీలో షర్మిల పార్టీ బెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.

ఆ ప్రచారానికి తగ్గట్టుగానే..షర్మిల సైతం పార్టీ పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో పార్టీ పెట్టబోతున్నారా? అని మీడియా, షర్మిలని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా షర్మిల… ఏపీలో పార్టీ పెట్ట‌కూడ‌ద‌ని రూల్ ఏం లేదు క‌దా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. రాజ‌కీయ పార్టీ ఎక్క‌డైనా పెట్టొచ్చని, మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నామ‌ని.. ఆ విధంగానే ముందుకెళ్తున్నామ‌ని వైఎస్ ష‌ర్మిల స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలని బట్టి చూస్తే..ఆమె ఏపీలో పార్టీ పెట్టే అవకాశం ఉందని అర్ధమవుతుంది.

ఒకవేళ ఏపీలో పార్టీ పెడితే జగన్‌కే ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ షర్మిల అంశంలో జగన్ ఏ మాత్రం స్పందించడం లేదని తెలిసింది. అయితే వైసీపీ నాయకులు మాత్రం షర్మిల పార్టీ పెడితే నష్టపోతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలిసింది. అందుకే ఆమెతో మాట్లాడి వైసీపీలోకి వచ్చేలా చేయాలని రాయబారాలు నడుపుతున్నట్లు తెలిసింది. మరి చూడాలి షర్మిల రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news