ఆనం..ఓ కోటంరెడ్డి..నెక్స్ట్ ఎవరు?

-

ఏపీలో అధికార వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఏకమవుతూ..వైసీపీపై పోరుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రజల్లో వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో సొంత పార్టీలో జరిగే ఆధిపత్య పోరు ఇంకా ఇబ్బందిగా మారింది. ఇక ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలు వైసీపీకి ఇబ్బందిగా మారుతున్నాయనుకునే లోపు..సొంత పార్టీ ఎమ్మెల్యేలు..తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

కేవలం సంక్షేమంపై ఫోకస్ పెట్టడం, అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోవడం, అధికారులు పెద్దగా సహకారం అందించకపోవడంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనిపిస్తుంది. ఇదే క్రమంలో సొంత ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఆనంకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వెంకటగిరి బాధ్యతల నుంచి ఆనంని తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆనం వైసీపీకి దూరమయ్యారు.

anam and kotamreddy | తెలుగు360

అయితే అదే తరహాలో విమర్శలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. అయినా సరే కోటంరెడ్డి వెనక్కి తగ్గలేదు..తనపై నిఘా పెట్టారని, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని సొంత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.  మూడు నెలల నుంచి తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని, ఈ విషయం తనకు ముందే తెలుసని, రహస్యాలు మాట్లాడుకునేందుకు మరో ఫోన్‌ ఉందని, 12 సిమ్‌ లు కూడా ఉన్నాయని తెలిపారు.

వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని, వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని, తమ్ముడికి పోటీగా తాను నిలబడనని, తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని, అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని అన్నారు. దీంతో కోటంరెడ్డి సైతం వైసీపీకి దూరమైనట్లే అని చెప్పాలి. మొన్న ఆనం, ఇప్పుడు కోటంరెడ్డి..నెక్స్ట్ వైసీపీకి షాక్ ఎవరు ఇస్తారో అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news