వైసీపీలో ఎమ్మెల్సీల లొల్లి… వాళ్ళకి మళ్ళీ నిరాశే?

-

అధికార పార్టీ అన్నాక పదవుల విషయంలో పోటీ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఒక పొజిషన్‌లో ఉన్న నాయకులు ఏదొక పదవి రాకపోకుండా ఉంటుందని ఆశగా ఎదురుచూస్తారు… పదవి వస్తే బాగానే ఉంటుంది… రాకపోతే మాత్రం అలకపాన్పు ఎక్కేస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో వైసీపీలో ఇదే పరిస్తితి వచ్చేలా ఉంది. ఎందుకంటే తాజాగా సీఎం జగన్ ఎమ్మెల్యే కోటాలో 3, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలని భర్తీ చేశారు. అంటే మొత్తం 14 స్థానాలని భర్తీ చేశారు. ఆ 14 మంది సభ్యులని కూడా ప్రకటించేశారు.

అయితే ఈ 14లో తమ పేరు కూడా ఉంటుందని పలువురు నేతలు ఆశించారు. తీరా పేరు లేకపోయేసరికి నిరాశలో మునిగిపోయారు. తాజాగా స్థానిక సంస్థల్లో 11 మందిని ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఖరారు చేశారు. విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం జిల్లా నుంచి వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్‌, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతబాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు నుంచి టి మాధవరావు, చిత్తూరు జిల్లా నుంచి భరత్‌, అనంతపురం నుంచి వై.శివరామిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ప్రకటించారు. అయితే టీడీపీకి స్థానిక సంస్థల్లో బలం లేకపోవడంతో ఈ 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.

అయితే పదవులు రాకపోవడంపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. గత ఎన్నికల్లో జగన్,… ఈయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ మంత్రి పదవి పక్కనబెట్టిన ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన మురుగుడు హనుమంతరావుకు పదవి ఇవ్వడంపై మర్రి వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది.

అటు సీనియర్ నేత దాడి వీరభద్రరావు సైతం పదవి ఆశించారు… కానీ ఆయనకు కూడా నిరాశే ఎదురైంది. ఇటు వల్లభనేని వంశీ ప్రత్యర్ధులుగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు సైతం పదవి ఆశించారు. వంశీని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకోవడంతో, తమకు ఎమ్మెల్సీలు వస్తాయని అనుకున్నారు. కానీ వీరికి కూడా నిరాశే ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news