వైసీపీ వర్సెస్ టీడీపీ: స్థానికంలో హోరాహోరీ…కుప్పంలో బాబుకు ఫస్ట్ షాక్?

ఏపీలో వాయిదా పడిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మిగిలిన పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపల్ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే నెల్లూరు కార్పొరేషన్‌కు కూడా ఎన్నిక నిర్వహిస్తుంది. అయితే 12 మున్సిపల్ స్థానాలకు, నెల్లూరు కార్పొరేషన్‌కు జరిగే ఎన్నికలు హోరాహోరీగా జరిగేలా ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠత మధ్య జరిగింది.

ysrcpandtdp
ysrcpandtdp

ఎక్కడకక్కడే అధికార వైసీపీ, టీడీపీ అభ్యర్ధులకు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల టీడీపీ నామినేషన్లకు బ్రేక్ వేసింది. అలాగే కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో 8 డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవం అయింది. టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురవ్వడంతో వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి.

ఇక కుప్పం మున్సిపాలిటీని అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో…దీనిపై వైసీపీపై దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో నామినేషన్ల సమయంలోనే చంద్రబాబుకు ఫస్ట్ షాక్ వచ్చేసింది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక కుప్పం మున్సిపాలిటీలో 87 మంది బరిలో ఉన్నట్లు అధికారులు జాబితా విడుదల చేశారు. అందులో 14వ వార్డు ప్రస్తావన లేదు. ఆ తర్వాత 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌ నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారని.. వైసీపీకి ఏకగ్రీవమైందని ప్రకటించారు. ఫోర్జరీ సంతకాలతో అధికారులు ఏకగ్రీవం చేశారని టీడీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. అంటే కుప్పంలో 25 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో ఒక వార్డుని వైసీపీ ఏకగ్రీవం చేసుకుని ముందజలో నిలిచింది. అటు దర్శి మున్సిపాలిటీలో కూడా ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవమైంది.

అయితే జగన్ సొంత జిల్లా కడపలో రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఒక్క ఏకగ్రీవం కూడా జరగలేదు. మొత్తానికైతే ఈ సారి కూడా లోకల్ ఫైట్ హోరాహోరీగా జరుగుతుంది.