సస్పెన్షన్‌తో క్లారిటీ..జూపల్లి-పొంగులేటికి బంపర్ ఆఫర్లు..షర్మిల పార్టీ వైపే?

-

మొత్తానికి చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక తాజా నిర్ణయంతో వారిద్దరికి మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారు..లేదా ఇండిపెండెంట్లుగా ఉంటూ బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని అనుకుంటారా? అనేది చూడాల్సి ఉంది.

వాస్తవానికి బి‌ఆర్‌ఎస్ లో పొంగులేటికి ప్రాధాన్యత లేకుండా పోయింది..ఆయన గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు..కనీసం ఎమ్మెల్సీ, రాజ్యసభ గాని ఇవ్వలేదు. చిన్న పదవి కూడా ఇవ్వలేదు. ఆయన కూడా చాలాకాలం పదవి కోసం చూశారు..కానీ పదవి దక్కలేదు. దీంతో నిదానంగా బి‌ఆర్‌ఎస్ కు దూరమై..ఇండిపెండెంట్ గా ముందుకెళుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి‌ఆర్‌ఎస్ లో సీట్లు దక్కే ఛాన్స్ లేని వారంతా పొంగులేటి వర్గంలో చేరిపోయారు. దీంతో పొంగులేటి ప్రతి స్థానంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ..తమ వర్గం తరుపున అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా కొత్తగూడెంలో సమావేశం పెట్టగా, దీని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఈయన గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బి‌ఆర్‌ఎస్ తరుపున ఓడిపోయారు. ఇక ఈయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. దీంతో జూపల్లి ప్రాధాన్యత తగ్గింది. నెక్స్ట్ సీటు కూడా లేదు. దీంతో జూపల్లి, పొంగులేటిని కలిశారు. ఇద్దరు కలిసి కే‌సి‌ఆర్ పై విరుచుకుపడ్డారు.

దీంతో వారిని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటపడటంతో వీరికి కాంగ్రెస్, బి‌జే‌పిలు బంపర్ ఆఫర్లు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ప్రజా మద్ధతు ఉన్న నేతలు కావడంతో వారిని తమ పార్టీల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్ పై ఉన్న అభిమానంతో వీరు షర్మిల పార్టీలో కూడా చేరవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటికి షర్మిల ఆహ్వానం పంపారు. మరి చూడాలి ఈ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారో.

Read more RELATED
Recommended to you

Latest news