డైరెక్టర్ చేతిలో ఘోర అవమానం పొందిన పూజా హెగ్డే.. కారణం..?

-

బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. నార్త్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు గురించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అలవైకుంఠపురంలో సినిమా వరకు మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ అవడంతో ఊహించని స్థాయిలో ఐరన్ లెగ్ అనే బిరుదు కూడా పొందింది. అలా ఆచార్య, బీస్ట్ ,రాధే శ్యామ్ వంటి మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అవడంతో ఈమెకు అవకాశాలు రావని అందరూ అనుకున్నారు . కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఒక తమిళ్ చిత్రంతో పాటు తెలుగులో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే ఒక డైరెక్టర్ చేతిలో ఘోరం అవమానం పొందింది అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ తేజ గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ తేజకు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా ఆయన సమంత అని సమాధానం చెప్పారు. సమంత కాకుండా ఎవరెవరు ఇష్టం? అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు తేజ సమాధానం ఇస్తూ.. మీరు హీరోయిన్ పేర్లు చెప్పండి ..నేను చెబుతాను అని చెప్పగా.. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల పేర్లు చెప్పారు యాంకర్.

అప్పుడు పూజా హెగ్డే పేరు చెప్పగా.. పూజా హెగ్డేనా ఆమె ఎవరు ..నాకు అసలు తెలియదే అంటూ డైరెక్టర్ ఆమెను అవమానించినట్లు మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే తేజకు తెలియకపోవడం ఏంటి అంటూ కూడా అభిమానులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news