విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్, పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు , మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలను కున్న పూరీ జగన్నాథ్ కు దెబ్బపడింది.
ఇక ఈ సినిమా నిర్మాత గా వ్యహరించిన ఛార్మి కౌర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. వీరు ఏదో అనుకొని తీస్తే అది మరోలా రిజల్ట్ ఇచ్చింది. ఇక తర్వాత జరిగిన డిస్టి బ్యూటర్స్ రచ్చ , పూరీ జగన్నాథ్ ఒపెన్ లెటర్ రాయడం మరో ఎపిసోడ్.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈడి అధికారులు పూరీ జగన్నాథ్ ను , ఛార్మి ని పిలవడం సంచలనం కలిగించింది.
ఈ సినిమా పెట్టుబడులు మరియు పారితోషికం ఎలా ఇచ్చారు అనే దానిపై పూరి నిర్మాత ,చార్మికి ఈడి అధికారుల 15 రోజుల క్రితం నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. కాని వారు ఈ విషయం ఎక్కడా లీక్ కాకుండా చూసుకున్నారు. అలాగే తమ లాయర్ల తో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై చర్చలు జరిపారట. ఈడి అధికారులు ముఖ్యంగా మైక్ టైసన్ కు ఇచ్చిన డబ్భులు గురించి, అలాగే సినిమా తీయడానికి ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు అనే దానిపై ఎక్కువ ప్రశ్నలు అడిగారట. మైక్ టైసన్ కోసం ప్రత్యేకించి చాలా రోజులు షూటింగ్ జరగటం, తనకి డాలర్స్ లో పేమెంట్ చేయటం అడిగారట.మళ్లీ అవసరం అయితే పిలుస్తామని అధికారులు చెప్పి పంపించారట.