మహిళలకి గుడ్ న్యూస్.. పోస్ట్ ఆఫీస్ నుండి కొత్త స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీముల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీముల్లో డబ్బులు పెడితే చక్కటి లాభాన్ని పొందడానికి అవుతుంది. మహిళలు, బాలికల కోసం కొత్త పొదుపు పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ పథకాన్ని వార్షిక బడ్జెట్ 2023-24 బడ్జెట్‌లో స్కీమ్ ని తీసుకు వచ్చారు.

 

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వచ్చింది ఈ స్కీము. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం అర్ధరాత్రి తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1.59 లక్షల పోస్టాఫీసుల్లో ఈ స్కీము ఇప్పుడు అందుబాటులో వుంది.

మహిళలు లేదా బాలికల పేరుపై ఈ స్కీముని ఓపెన్ చెయ్యచ్చు. ఏప్రిల్, 2023 నుంచి మార్చి, 2025 వరకు రెండేళ్లపాటు ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. 7.50 శాతం మేర స్థిరమైన వడ్డీ ఈ స్కీము తో లభిస్తుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. దగ్గర లోని పోస్టాఫీసుకు వెళ్లి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన దరఖాస్తు ఫారాన్ని తీసుకోవాలి. వివరాలని ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం అవసరమైన ఆధార్, పాన్ కార్డు ని కూడా ఇవ్వాలి. డిపాజిట్ ఎంత చేస్తున్నారనేది తెలియజేయాలి. పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్ ఇస్తారు. డిపాజిట్ మొత్తంలో 40 శాతం వరకు వెనక్కి ఇస్తారు. గడువు పూర్తయ్యే దాకా అకౌంట్ ని క్లోజ్ చేసేందుకు ఎవ్వడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version