అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్…ఏడాదికి లక్షకి పైగా పొందొచ్చు..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా మీకు నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటే ఈ స్కీమ్ వివరాలను చూడండి. ప్రస్తుతం బ్యాంకుల లానే పోస్ట్ ఆఫీస్ కూడా సేవలను అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి.

ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. ఈ స్కీమ్ కింద డబ్బులు పెడితే ప్రతి సంవత్సరం రూ. 1,11,000 పొందుతారు. గ్యారెంటీ తో లాభం కూడా వస్తుంది. రిస్క్ ఏం ఉండదు, ఇక ఈ స్కీమ్ వివరాలను చూస్తే.. 7.4 శాతం వడ్డీ ని ఈ స్కీమ్ తో పొందొచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ఎంత డబ్బులు పెట్టాలంటే..?

ఈ స్కీమ్ లో మీరు కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు. మాక్సిమం అయితే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి ఐదు ​​సంవత్సరాలు. కావాలంటే మరో మూడేళ్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వలన కలిగే లాభాలు:

ఇందులో డబ్బులు పెడితే 80C ఆదాయపు పన్ను కింద మీరు 1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.
వడ్డీ 50,000 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు.

ఎంత డబ్బులు వస్తాయంటే…?

ఈ స్కీమ్ కింద 15 లక్షలను పెడితే ప్రతి త్రైమాసికంలో రూ. 27750 పొందచ్చు. వార్షిక మొత్తం రూ. 1,11,000 అవుతుంది. రెట్టింపు కావాలంటే ఉమ్మడి ఖాతాను తెరవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news