హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా !

-

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం రేగింది. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు హైదరాబాద్‌ లో ఈ పోస్టర్లు అతికించినట్లు సమాచారం అందుతోంది. మొన్న… బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పోస్టర్లు వేస్తే.. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోస్టర్లు అతికించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలమైన కేసు.

అనూహ్యంగా ఇప్పుడు పలువురి అరెస్టులతో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి..తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత సన్నిహితులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతల మధ్య వివాదం తలెత్తుతోంది.ఈ తరుణంలో.. పోస్టర్లు వేస్తున్నాయి ఇరు పార్టీలు.

Read more RELATED
Recommended to you

Latest news