ప్రీతిది ఆత్మహత్యే.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

-

వరంగల్​లో మెడికో ప్రీతిది ఆత్మహత్యే. ఈ విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పాయిజన్​ ఇంజక్షన్​ తీసుకొని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ప్రీతి ఆత్మహత్యకు సైఫ్​ కారణమని చెప్పిన వరంగల్​ సీపీ రంగనాథ్​. వారం పది రోజుల్లో చార్జిషీట్​ వేస్తామని చెప్పారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ మెడికో సైఫే కారణం చెప్పారు.

Warangal CP AV Ranganath About Medico Case , Says Preethi Was Targeted By  Dr Saif

ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ సైఫ్‌కు బెయిల్‌ మంజూరైంది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్‌కు బుధవారం (ఏప్రిల్ 19న) షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. అయితే.. పూచీకత్తు, సంతకాల విషయంలో జాప్యం జరగడంతో విడుదల ఆలస్యమైంది. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్‌ని పోలీసులు గురువారం (ఏప్రిల్ 20న) వరంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. బెయిల్‌ ఉత్తర్వుల కాపీ వరంగల్‌ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో సైఫ్‌ను కోర్టు నుంచి ఖమ్మం జైలుకు తీసుకు వచ్చి సంతకాలు తీసుకుని సాయంత్రం ఆరుగంటల సమయంలో సైఫ్‌ను విడుదల చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news