ద్రౌపది ముర్ము స్వగ్రామానికి విద్యుత్ లైన్.. ఎన్నో ఏళ్లుగా చీకట్లోనే!

-

ఎన్నోఏళ్లుగా ఆ గ్రామం చీకట్లోనే మగ్గుతోంది. తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల ఆ గ్రామం పేరు జాతీయ స్థాయి వార్తల్లో నిలవడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. దీంతో రంగంలోని దిగిన అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు తాము పడుతున్న బాధలకు మోక్షం లభించిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ద్రౌపదీ ముర్ము
ద్రౌపదీ ముర్ము

ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతం. అయితే, ద్రౌపది ముర్ము ఆ గ్రామం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న పట్టణానికి మకాం మార్చారు. అయితే ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయన్ తుడు, ఆయన భార్యాపిల్లలు ఆ గ్రామంలో నివాసముంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ గ్రామం పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. దీంతో ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామానికి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news