జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం

-

కరోనా వలన ప్లీనరి సమావేశం రెండు సంవత్సరాలు జరుపుకొలేకపోయామని…జూలై 8, 9 తేదీల్లో వైసిపి రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరుగుతుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ ది….500 హామీలు ఇచ్చి మానిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం చేశారు.

ఏ సమస్యలు ఉన్నా నేరుగా నాకు సమాచారం అందిస్తే తక్షణం స్పందిస్తా…నా పై బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన నేరుగా గడప గడపకు వెళ్ళలేక పోయాఅని తెలిపారు. నా తరపున మన నాయకులు గడప గడపకు తిరుగుతున్నారు. వైసిపి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వారు ప్రజలలోకి తీసుకెళ్లాలి…కులం, మతం, పార్టీ చూడకుండా పేదరికం చూసి వైఎస్ జగన్ పథకాలు అందిస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఎన్నికల్లో ఓడిపోయినా వారిని జన్మభూమి కమిటీల్లో వేసిన వ్యక్తి చంద్రబాబు అని…ఆ కమిటీల్లోవారు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారు అని చెప్పారు. అసరా కింద 26 వేల కోట్లు నాలుగు విడుతల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లిస్తుంది…గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇన్ని సంవత్సారాల్లో 95 శాతం హామీలు అమలు చేసిన వేరే ముఖ్యమంత్రిని నేను చూడలేదు…ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు 6 జిల్లాలకు 8 వేల కోట్లు రూపాయలు పైన సిఎం జగన్ మంజూరు చేశారని తెలిపారు. గండికోట నుండి మనకు నీరు ఇచ్చేందుకు 2700 కోట్లతో ప్రాజెక్టులు సిద్దం చేస్తున్నాం…చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదు, అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదు..వైఎస్ జగన్ సిఎం అయ్యాక పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news