ఎడిట్ నోట్: కామారెడ్డి చిచ్చు.!

-

తెలంగాణలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. మున్సిపల్ అధికారులు తీసుకొచ్చి కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌పై గత నెల రోజుల నుంచి స్థానిక రైతులు పోరాటం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే మొదట్లో ఈ ఆందోళనలని కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

రాములుకు కామారెడ్డి పట్టణ శివారులో 3 ఎకరాల సాగుభూమి ఉంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల గతంలో 3 ఎకరాల భూమిని రాములు అమ్మకానికి పెట్టాడు. కానీ కామారెడ్డి మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్‌తో ఆయన భూమి ఇండస్ట్రీయల్ జోన్‌లోకి మారడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు..ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో బాధిత రైతులు…రాములు మృతదేహాన్ని తీసుకొచ్చి బల్దియా వద్ద ఆందోళనకు బయలుదేరగా, మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో జాతీయ రహదారిపైనే ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగడం..అటు  అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయ ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పిఏసీఎస్ డైరెక్టర్, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు రాజీనామా చేశారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Raithanna Kannera on Master Plan | telangana news ktr trs cm kcr chsh

ఇక కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను నిలువరించారు. దీంతో ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. కామారెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ నిర‌స‌న‌ల‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్‌ను ప్రశ్నించి, ఈ అంశం గురించి తనకు తెలియదని కేటీఆర్ చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం మార్పులు చేర్పులు చేస్తామని చెప్పొచ్చు కదా అని కేటీఆర్ అధికారులకు సూచించారు.

ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే ప్లాన్ లో మార్పులు చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక రైతులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..రైతులకు మద్ధతు తెలిపారు..ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే రైతులు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు…బంద్‌కు ప్రతిపక్షాలు మద్ధతు ఇస్తున్నాయి. రైతులని ఇబ్బంది పెట్టే ఈ మాస్టర్ ప్లాన్‌లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news