ఏపీలో కాదు తెలంగాణలో కూడా కిరణ్ కుమార్‌ రెడ్డి ప్రభావం ఉంటుంది-ప్రహ్లాద్ జోషి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో ఇవాళ ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి స్వాగతిస్తున్నానన్నారు.

ఆయన చేరికతో ఏపీ బీజేపీ బలోపేతం కానుంది. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ లో ఉన్నారు..ఆయన బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారని వివరించారు ప్రహ్లాద్ జోషి. ఇకపై తన ఆట బీజేపీ కోసం ఆడతారు.. మోడీ నేతృత్వంలో సాగుతున్న పోరాటానికి కిరణ్ కుమార్ రెడ్డి భాగస్వామ్యం కానున్నారు..ఏపీ లోనే కాదు తెలంగాణలో కూడా కిరణ్ ప్రభావం ఉంటుందన్నారు ప్రహ్లాద్ జోషి.

Read more RELATED
Recommended to you

Latest news