తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు సమర్పిస్తారో తెలుసా..లడ్డూ, వడ, అప్పాలే కాదు..ఇంకా ఉన్నాయి..!

-

తిరుమల శ్రీవారిగా అశేష భక్తజనం కొలుచుకునే శ్రీ వెంకటేశ్వరస్వామిని ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైన దైవంగా భావిస్తారు. నిలువెత్తు ఆ శ్రీనివాసుడి దర్శనం..కళ్లలో కాంతిని చూస్తే..మన జన్మ ధన్యం అయినట్లే..పేద, ప్రముఖ అని తేడా లేకుండా..అందరిని ఆదరించే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లటం అంటే మనం పుణ్యం చేసుకున్నట్లే.. చాలామంది వెళ్లాలని మనసులో అనుకుంటారు.. కానీ ఆ దేవుడి అనుగ్రహం లేకుంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి కొండ ఎక్కలేరు.

కలియుగ ప్రత్యక్ష దేవం ఆ శ్రీనివాసుడు. తిరుపతి అంటే..ఆ మహాప్రసాదం లడ్డు గురించి అందరికి తెలుసు. కానీ ఆ శ్రీనివాసుడికి మనకు తెలియని, మనం తినని నైవేద్యాలు ఇంకా ఉన్నాయి. ఎన్ని రకాల ప్రసాదాలు ఇస్తారో తెలుసుకుందాం.

బంగారంతో మెరిసిపోయే ఆనంద నిలయంలో కొలువైన స్వామివారు అలంకార ప్రియుడు మాత్రమే కాదు ఆహార ప్రియుడు కూడా. స్వామి వారికి తిరుమల లడ్డూతోపాటూ రకరకాల ఆహార పదార్థాలంటే ఎంతో ఇష్టం. అందుకే రోజూ వేంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదాలల్లో చాలా రకాలు ఉంటాయి. వడ, అప్పాలు సమర్పిస్తారని చాలా మందికి తెలుసు. కానీ ఎక్కువ మంది భక్తులకు తెలియని దోశ, జిలేజీ, మురుకు, పోలిలను కూడా స్వామి వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసి నివేదిస్తారు.

ఇక్కడి లడ్డూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. వాటి ధరలను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఇటీవలే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 100 రూపాయలుగా ఉన్న వీటి ధరలను 500 రూపాయలకు పెంచుతూ టీటీడీ ధార్మిక సంస్థ నిర్ణయించింది. ఈ స్పెషల్ నైవేద్యాల గురించి సామాన్య భక్తులకు పెద్దగా తెలియదు. కానీ టీటీడీలో చేసే ఉద్యోగ కుటుంబాలకు ఇవి పరిచయం లేని నైవేద్యాలు.

ఏదో ఒక సందర్భంలో వారు వీటిని రుచిచేసే ఉంటారు. ఇంకా కొందరు ప్రముఖులు కూడా. స్వామి వారికి త్రికాల నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్య సమమాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తున్నారు. కేవలం గురు, శుక్ర వారాల్లో మాత్రం నైవేద్య సమయాల్లో మార్పులు ఉంటాయి. మిగతా రోజుల్లో ఎటువంటి మార్పు ఉండదు.

స్వామి వారికి ప్రసాదాలు నివేదించడం కోసం పాత రోజుల్లో అనేక మంది రాజులు మణులు, మాణిక్యాలను సమర్పించారు. తిరుమల శ్రీ వారి ఆలయ గోడల మీద మనకు ఏ ఏ రాజవంశానికి చెందిన రాజులు ప్రసాదాల కోసం ఎంత డబ్బులు ఇచ్చారనేది శిలా శాసనాల్లో చెక్కారు.. ఆ శిలా శాసనాలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ విషయాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి వారి ప్రసాదానికి ఆనాటి రాజులు ఎంతగా విలువిచ్చారు అని..శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు నిర్ధేశించిన పూజా నియమాల ప్రకారంగానే స్వామి వారికి అన్ని పూజలను చేయిస్తూ వస్తోంది. ఇప్పటికీ మిరాశి అర్చకులే స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూ వస్తున్నారు.

జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడుకి సమర్చించే అన్ని రకాల ప్రసాదాలు రుచి చూడాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు. ఇంతకీ మీరు ఎన్ని రకలా నైవేద్యాలు తిన్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news