ధాన్యం కొన‌క‌పోతే.. ఇండియా గేట్ ద‌గ్గ‌రే పార‌బోస్తాం : ప్ర‌శాంత్ రెడ్డి వార్నింగ్‌

బీజేపీ పార్టీ ప్ర‌భుత్వం పై తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యం కొన‌క‌పోతే.. ఇండియా గేట్ వ‌ద్దే పార‌బోస్తామ‌ని హెచ్చ‌రించారు. రైతుల నుంచి వరి ధాన్యం తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

కేంద్రం కనుక రాష్ట్రం నుంచి కొనుగోలు చేయకపోతే కొన్న ధాన్యాన్ని ఇండియా గేట్ దగ్గర పోస్తామ‌ని… కేంద్రం కనుక రాష్ట్రానికి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని పొడిగింపు హామీ ఇవ్వకపోతే మొత్తం ధాన్యాన్ని ఇండియా గేట్ వద్ద తీసుకొచ్చి పోస్తామ‌ని హెచ్చ‌రించారు. గోడౌన్లు ఏర్పాటు చేయలేక, కేంద్ర వైఫల్యం రాష్ట్రం పై నెట్టే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. నిన్నటితో కేంద్ర మంత్రి అడిగిన రెండు రోజుల గడువు పూర్తయింద‌ని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామ‌నిహెచ్చ‌రించారు ప్ర‌శాంత్ రెడ్డి. తెలంగాణలో ఎఫ్ సీఐ గోదాంలు నిండిపోయామని.. వాటిని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని పంపించలేదనే కేంద్రం వాదన సరికాదని ఆయన అన్నారు.