ప్రశాంత్ కిషోర్ బీహార్ రౌడీ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆయన అంచనాలు ఎక్కడ పనిచేయమంటూ మాట్లాడుతూ వచ్చారు.. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ నేతల ట్రాప్ లో పడ్డారని ప్రచారం నడుస్తోంది.. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. దాన్ని పక్కనపెట్టి బీహార్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో వార్తల్లో నిలిచేందుకు రోజుకొక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు.. డబ్బులు తీసుకొని కొన్ని పార్టీలపై విషం కక్కుతున్నారు . అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీతో చీకటి ఒప్పందాన్ని కుదిరించుకొని.., వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు చెబుతున్నారంటూ ఏపీలోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చంద్రబాబు దగ్గర ప్యాకేజ్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ని దూరం పెట్టేశారు.. దీంతో ఆయన చంద్రబాబు పంచన చేరారు. ఏపీలో జీవం లేని తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.. ఇటీవల చంద్రబాబు నాయుడ్ని హైదరాబాదులో కలిసి ఆయన దగ్గర భారీ స్థాయిలో ఫీజు తీసుకున్నారని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టం అంటూ ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు.. రాజకీయ వ్యూహ కర్త పాత్రను పక్కన పెట్టేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు.. ఏపీలో ఆయనకు సర్వే టీం లేదు అసలు సరైన నెట్వర్క్ లేదు.. కానీ నోటికొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ తీసుకొచ్చేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు . చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకొని వైసీపీపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారనేది సుస్పష్టం..
పీకే మాటల్లో శాస్త్రీయత ఉందా..?
రెండు మూడు రాష్ట్రాలలో ఉండే రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అక్కడ కొద్దిగా సక్సెస్ అయ్యారు.. తరువాత ఆయన వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కర్ణాటకలో మళ్లీ బిజెపి ప్రభుత్వమే వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకోచ్చారు.. కానీ అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చారు.. ఇక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ జోస్యం ఫెయిల్ అయింది.. నిన్నకాక మొన్న ఎన్నికలు జరిగినా తెలంగాణలో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం గురి తప్పింది.. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పగా..
అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. 95% హిందువులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోనూ ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి.. 60% మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఇలా ప్రశాంత్ కిషోర్ వేసే ప్రతి అంచనా ఫెయిలవుతోంది.. రాజకీయ పార్టీలతో లోపాయికారి ఒప్పందం పెట్టుకోవడం వారి దగ్గర భారీగా ఫీజులు తీసుకొని వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రశాంత్ కిషోర్ కి ఇటీవల బాగా అలవాటైపోయిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ తరహా అంచనాలే వేస్తున్నారని.. మునిగిపోయిన నావగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల అంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ చెప్పే ప్రతి మాట అబద్ధం అనేది రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైపోయిందన్న మాట..