పురుగు మందుల వాడకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

-

వర్షాల ప్రభావం పంటల పై పడుతుంది..దాంతో కొన్ని పంటలకు పురుగు ఆశిస్తాయి.అయితే వాటిని చంపడానికి రసానిక మందులను తప్పక వాడాలి..పంటలో సుమారు 30 శాతం వరకూ వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళు ఆశించటం ద్వారా నష్టపోతున్నారు.పురుగులు, తెగుళ్ళ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి పంటను కాపాడుకోవడానికి రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల విచక్షణారహితంగా వివిధ రకాల పురుగు మందులు వాడుతున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువ అవడం తో పాటుగా పురుగులలో పురుగుమందులను తట్టుకునే శక్తి మరియు వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతున్నాయి. రైతులు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

అందుకే రైతులు పురుగు మందులు కొనేటప్పుడు, వినియోగించేటప్పుడు క్రింది సూచించిన మెళకువలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు పొందడంతో పాటు తమ ఆరోగ్యాన్ని,అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు..చీడపీడలు కనపడక ముందే ముందు జాగ్రత్తగా కొంతమంది రైతులు పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. ఇలా చెయ్యడం వలన మనకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోయి వాటి ద్వారా నియంత్రించబడే చీడపీడల సంఖ్య గణనీయంగా పెరిగి పంటకు నష్టం కలిగిస్తాయి. మనకు మేలు చేసే పురుగులు చనిపోయి వాటి ద్వారా నియంత్రించబడే చీడపీడల సంఖ్య గణనీయంగా పెరిగి పంటకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల సస్యరక్షణ ఖర్చులు కూడా బాగా పెరిగిపోతుంది. రైతులు హానిచేసే పురుగుల సంఖ్య ఆర్థిక ప్రవేశ స్థాయి దాటిన తరువాత మందులు పిచికారీ చేసుకుంటే మంచిది.

పొలంలో సహజ శత్రువులు మరియు పురుగుల సంఖ్య 2ః1 నిష్పత్తిలో ఉన్నప్పుడు పురుగు మందులను పిచికారి చేయరాదు. అదేవిధంగా సప్హజ శత్రువులైన పరాన్న జీవులు మరియు పరాన్నభుక్కులను పొలంలో విడిచి పెట్టడానికి ఒక వారం ముందు, విడిచిన తరువాత వరకు పురుగు మందులను పిచికారి చేయరాదు.కొంత మంది రైతులు పంట కోతకు వచ్చిన సమయంలో కోతకు రెండు నుండి మూడు రోజుల ముందు కూడా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.

కోత అనంతరం ఆహారపదార్థాలపై పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. అవి మన శరీరంలోనికి ప్రవేశించి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అంతేకాకుండా పరిమితికి మించి ఆహార పదార్థాలపై పురుగుమందుల అవశేషాలు ఉంటే వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా తిరస్కరిస్తారు..అందుకే పురుగు మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news