ప్రీతి గుండె ఆరు సార్లు ఆగింది : వైద్యులు ప్రకటన

-

కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు ఆమె గుండె ఆరుసార్లు ఆగిందని, సిపిఆర్ చేసి పనిచేసేలా చేసినట్లు వెల్లడించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్, ఎక్మో యంత్రం సాయంతో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ప్రీతి ఆడియో..తాజాగా బయటపడింది. సైఫ్ వేధింపులపై తల్లితో చెప్పుకున్న ప్రీతి…. సైఫ్ ఎలా వేధిస్తున్నాడో తల్లితో చెప్పింది. సైఫ్ బ్యాచ్ మొత్తం ఎలా ఉంటుందో తల్లికి చెప్పిన ప్రీతి…. సైఫ్ పై ఫిర్యాదు చేస్తే తనకు ఏం జరుగుతుందో వివరంగా చెప్పింది. ఇప్పటికే సైఫ్‌ పై తండ్రి ఫిర్యాదు చేశాడని తల్లికి చెప్పింది ప్రీతి. సైఫ్ పై ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపల్ పిలిచి అడిగాడని చెప్పింది ప్రీతి.చదువుకోవాలంటే భయమేస్తుంది అని చెప్పిన ప్రీతి…ఆ ఆడియోలో ఎంతో కుమిలి పోయింది. సైఫ్ ఏమి చేయలేడని ధైర్యం చెప్పిన ప్రీతి తల్లి…. చదువు మీద దృష్టి పెట్టాలని ప్రీతికి చెప్పింది. ఇక ఈ ఆడియో ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news