పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. తోషాఖానా అవినీతి కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. ఈ మేరకు లాహోర్ లోని జమాన్ పార్కులో ఉన్న ఇమ్రాన్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. కాగా ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇమ్రాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తహ్రీక్ – ఎ – ఇన్సాఫ్ పిఐటి కి 7.32 లక్షల అమెరికా డాలర్ల విదేశీ నిధులు అందాయని ఆధారాలతో సహా పాకిస్తాన్ ఎన్నికల సంఘం వెల్లడించింది. 349 విదేశీ కంపెనీలు, 88 మంది వ్యక్తుల నుంచి ఈ నిధులు వచ్చినట్లు ఈసీపీ పేర్కొంది. నిజానికి పాకిస్తాన్ లో రాజకీయ పార్టీలు విదేశీ నిధులు స్వీకరించడం పై నిషేధం ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ నిషేధిత విదేశీ నిధుల సేకరణ అభియోగాలపై కొన్నేళ్లుగా విచారణ కూడా జరుగుతుంది. దీంతో ఇప్పుడు ఇమ్రాన్ ను అరెస్టు చేయడంతో పాటు ఆయన పార్టీని పాకిస్తాన్ రాజకీయాల నుంచి బ్యాన్ చేసే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు.