రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయి – పొంగులేటి

-

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని విమర్శించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలే తెలంగాణను అప్పులకుప్పగా మార్చాయని అన్నారు.

ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు సంబంధం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కాలేదన్నారు పొంగులేటి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో దళిత బంధు పథకంతోనే అర్థమైందన్నారు. ఒక గ్రామంలో కూడా 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టలేదన్నారు. ఇక రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రకటిస్తానన్నారు పొంగులేటి. అధికారం శాశ్వతం కాదని.. రాబోయే ప్రభంజనంలో మీరంతా కొట్టుకుపోతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news