Breaking : ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూస్తున్న 16వ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ నేడు జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రారంభ‌మైన తొలి నిమిషంలోనే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ప‌లు రాష్ట్రాల సీఎంలు, ఆయా పార్టీల కీల‌క నేత‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పార్ల‌మెంటు భ‌వ‌నంలో ఎంపీల‌కు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

President Elections 2022 Live: PM Modi, Congress MP Manmohan Singh, others  cast their votes

ఇక ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 21న వెల్ల‌డి కానున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల‌ను ఢిల్లీకి త‌ర‌లించిన తర్వాత ఈ నెల 21న ఓట్ల లెక్కింపును చేప‌ట్ట‌నున్న అధికారులు… అదే రోజు ఫ‌లితాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. నూత‌న రాష్ట్రప‌తిగా ఎన్నిక కానున్న అభ్యర్థి ఈ నెల 25న భార‌త రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేస్తారు. సోమ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news