ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల తలకిందులయ్యాయి. దీనికి తోెడు నిత్యావసరాల ధరల్లో పెరుగుదల సామాన్య ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో సామాన్యుడికి మరో షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి కంపెనీలు. త్వరలో ఏసీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మిషన్ల ధరలు పెరుగనున్నాయి. ఎల్జీ, పానసోనిక్, హైయర్, హిటాచీ వంటి కంపెనీలు మార్చిలోగా ధరలు పెంచనున్నట్లు తెలిపాయి. 7 నుంచి 10 శాతం వరకు రేట్లు పెరుగుతాయిని కంపెనీలు చెబుతున్నాయి.
లోహాలు, ప్లాస్టిక్ వంటి ముడి పదార్థాలకు రేట్లు పెరగడంతో రేట్లు పెంపు అనివార్యంగా మారుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో పాటు రవాణా ఖర్చులు కూడా తగ్గించేందుకు ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను పెంచుతున్నారు. ఇటీవల కాలంలో ముడిపదార్ధాల రేట్లు పెరుగుతుండటంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాటను అనుసరిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే ముడిపదార్థాల రేట్లు, చిప్ సెట్ల కొరత కారణంగా బైక్ లు, కార్ల వంటి వాటి ధరలు కూడా పెరిగాయి.