ప్రభాస్ ప్రోజెక్ట్ కె అదిరిపోయేలా,మరో లెవెల్లో..!!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి తొలి బాలీవుడ్ మూవీగా ‘ఆది పురుష్’లో నటిస్తున్న ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసాడు. గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉంది, వచ్చే సంవత్సరం జులై నెలలో విడుదల కాబోతుంది.దాని తర్వాత  ‘సలార్’లో , రాజా డీలక్స్ మరియు ప్రోజెక్ట్ కె సినిమాలలో  నటిస్తున్న విషయం తెలిసిందే.

సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి  దించారట.ఈ విలన్‌ పాత్ర లో నటిస్తున్న పృథ్వీరాజ్ సలార్ సినిమా లో యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోష పెట్టాడు.. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోకు బ్లాక్ బస్టర్ రాబోతుందని ధీమాగా ఉన్నారు. ఇక మరో సినిమా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సినిమా కోసం భారత దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా పెట్టని బడ్జెట్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు భూమి మీద లేని కార్లతో షూటింగ్ జరుగుతోందట. సినిమా అంతా హలీవుడ్ లెవల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్ట్ దశలో సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.  తాజా  డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు కూడా ప్రభాస్ తో కలిసి మాట్లాడారు.  ప్రభాస్ తో సింగీతం శ్రీనివాస రావు వున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news