ఏ సమస్యనైనా కేంద్రము దృష్టికి తీసుకెళ్లి దానిని పరిష్కరిస్తానని మాట ఇస్తున్న: ఈటెల రాజేందర్

-

కుత్బుల్లాపూర్ MGS ఫంక్షన్ హాల్ లో జరిగిన అభినందన సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మల్కాజిగిరి ప్రజలు పార్టీలతో సంబంధం లేకుండా నాకు ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు నాలుగు లక్షల మెజారిటీని ఎంతో ఇష్టంతో, విశ్వాసంతో కట్టబెట్టారు. దానిని నిలబెట్టుకుంటానని హామీ ఇస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక కాలనీలు తిరిగాను. వారు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా అందరి నోట ఒకే మాట, మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలనే కోరికతో రాజేందర్‌కే ఓట్లు వేస్తామని చెప్పారు.

44 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనకు అధికారం రాకపోతుందా అని ఎదురు చూశారు. వారికి రావలసిన పథకాలన్నీ అందజేస్తానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ వారు కేవలం 99 సీట్లు గెలిచి, 240 సీట్లు సాధించిన బీజేపీ పార్టీని కూటమి ప్రభుత్వం అంటూ హేళన చేస్తున్నారు. కేవలం 3 పార్టీలతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ పదుల సంఖ్యలో పార్టీల కూటమిని కూడగట్టుకుని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.

మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఎన్నికకూ ప్రభుత్వాలు, పార్టీలు మారుతున్నాయి. అంటే ప్రజలు ఐదేళ్ల కన్నా ఏ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో ఎక్కడా పదేళ్ల కంటే ఒకే పార్టీ పాలించలేదని వారు గుర్తు పెట్టుకోవాలి. సంకీర్ణ రాజకీయాల కాలంలో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని ఈ కాలంలో ప్రజలు ప్రధాని మోదీకి మరోసారి అవకాశం ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బు పంచి ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఏ ఎన్నికలు వచ్చినా మా కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని సూచిస్తున్నాను. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఎలా కొట్లాడుతామో సర్పంచ్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అలాగే కొట్లాడుతామని మనవి చేస్తున్నాను. పాత,కొత్త నాయకులను ఎవరికీ తక్కువ కాకుండా సమన్వయం చేస్తుంది బీజేపీ పార్టీ. ఏ రాష్ట్రం కూడా ఎవరి జాగీరు కాదు. ఎప్పటికీ ప్రజలదే ప్రభుత్వం. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొనుకుంటేనో, మద్యం పంచితే గెలుపు సాధ్యం కాదని ఈ ఎన్నికలు నిరూపించాయి అని అన్నారు.ఏ సమస్యనైనా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానిని పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటి వరకూ అమలు కాలేదు. వీటన్నింటినీ సాధించే వరకూ కొట్లాడుతాను అని ఆయన అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version