500 సంస్థలకు కొవ్వులందిస్తున్న మనోరమ ఇండ్రస్ట్రీస్.. లక్షల మంది మహిళలకు ఉపాధి

-

ఈ రోజుల్లో చాక్లెట్స్ అంటే.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తింటారు. ఇక బాడీలోషన్లు కూడా అంతే.. ఎని టైం డిమాండ్ ఉండే ప్రొడెక్ట్స్ లో ఇవి రెండూ ఉంటాయి. వీటి తయారీకి కొన్ని స్పెషల్ ఫ్యాట్స్ కావాలి. మరి అలాంటి స్పెషల్ ఫ్యాట్స్ ను తయారు చేసే ఓ కంపెనీ.. మనోరమ ఇండ్రస్ట్రీస్.. ఒక లేడీ ముందుండి ఈ కంపెనీనీ దిగ్విజయంగా నడిపించడమే కాక.. 80లక్షల మందికి మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. చాలా గొప్ప విషయమే ఇది. మనోరమ ఇండస్ట్రీస్‌ ఛైౖర్‌పర్సన్‌ వినీత సరాఫ్‌ సక్సస్ ఫుల్ స్టోరీ అందరూ తెలుసుకోవాల్సిందే..
2005.. ఆసిఫ్‌ షరాఫ్‌, వినీత సరాఫ్‌ దంపతులు ‘మనోరమ ఇండస్ట్రీస్‌’ పేరుతో స్పెషాలిటీ కొవ్వుల వ్యాపారాన్ని ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించారు. చాల తక్కువ కాలంలోనే.. ఈ సంస్థ తమ ఉత్పత్తులని 85 దేశాలకు చెందిన 500 సంస్థలకు అమ్మే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రూ.180 కోట్ల వ్యాపారం చేస్తోంది.
సంస్థ ఏం చేస్తుంది..?
చాక్లెట్లు, సౌందర్య లేపనాల తయారీలో సీబీఈ, ఎస్‌బీఈ అనే కొవ్వులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. వీటి తయారీకోసం మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు చెందిన లక్షల మంది మహిళల సాయంతో అడవుల్లోని గుగ్గిలం గింజలు, మామిడి విత్తనాలు, కోకమ్‌ గింజలు వంటివి వీళ్లు సేకరిస్తారు.
ఈ సంస్థ ఆఫ్రికాలో కూడా విస్తరించింది. అక్కడ ఘనా, బుర్కినాఫాసో, ఐవరీకోస్ట్‌, టోగో, మాలీ, నైజీరియాకు చెందిన పొదుపు సంఘాల మహిళలు కొకోవా, షియా విత్తనాలని సేకరించి రాయ్‌పూర్‌లో ఉన్న ఈ పరిశ్రమకు తరలిస్తారు. ఇక్కడ తయారైన కొకోవాబేస్డ్‌ ఈక్వెలెంట్లు, షియాబేస్డ్‌ఈక్వెలెంట్లని ఫెరీరోతోపాటు లోరియల్‌, బాడీషాప్‌ వంటి ఎనభైఐదు దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోని పది ప్రముఖ స్పెషాలిటీ బటర్‌ తయారీ సంస్థల్లో ఇదీ కూడా ఒకటి.
ఏడాదికి 15వేల మెట్రిక్‌టన్నుల కొవ్వులని తయారుచేసే ఈ సంస్థకి వినీతాసరాఫ్‌ ఛైర్‌పర్సన్‌గా కీలకపాత్ర వహిస్తున్నారు. బెంగళూరులోని మౌంట్‌కారామెల్‌ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేసిన ఈమెకు … ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో 18ఏళ్ల అనుభవం ఉంది. ‘లండన్‌లో అతిపెద్ద సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘బాడీలోషన్‌’కి కావాల్సిన కొవ్వులన్నీ ఇక్కడి నుంచే ఎగుమతి అవున్నాయంటే.. క్రేజ్ ఏ రేంజ్ లో ఉందే మీరు ఆలోచించండి.. అదేకాదు లోరియల్‌, హర్షీస్‌, నెస్లే, రోచెర్‌ ఫెరీరో వంటి సంస్థలకు కావాల్సిన కొవ్వులనీ కూడా వీరే ఎగుమతి చేస్తారట.
పలు రాష్ట్రాల్లోని గిరిజన మహిళలు అడవుల్లోని వ్యర్థాలని సేకరించి వారికి ఇస్తారు. అడవుల్లోని వ్యర్థాలతోనే లక్షలమంది మహిళలకు ఉపాధినివ్వడంతోపాటు… నూనెలు, కొవ్వులు తీసేసిన తర్వాత వచ్చే వ్యర్థాలు… అంటే తెలకపిండిలాంటి పదార్థాలను పశువులకు చక్కని పశుగ్రాసంగా కూడా ఈ సంస్థ అందిస్తుంది. అందుకే అత్యుత్తమ పర్యావరణ హిత వ్యాపారవేత్తగా ఎన్నో అవార్డులని వినీత అందుకున్నారు. మామిడి పండ్ల నుంచి తీసే… మేంగో బటర్‌ తయారీలో ప్రపంచవ్యాప్తంగా ముందున్నారు..
పూర్తిగా పర్యావరణ హితంగా వీరి ప్రొడెక్ట్స్ ఉండటంతో.. డిమాండ్ బాగుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news