ఏపీలో 175 నియోజకవర్గాలను జిల్లాలు చేయండి : నారా లోకేష్

-

ఏపీలో 175 నియోజకవర్గాలను జిల్లాలు చేయండని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన పార్లమెంట్ చట్టం ద్వారా జరిగింది.. పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించలేమని మండిపడ్డారు. మూడు రాజధానులు కావాలంటే.. రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్ సవరణ చేయాలని చురకలు అంటించారు. మూడు రాజధానుల విషయంలో మాత్రమే శాసన సభలకు అధికారం లేదని చెప్పింది… పరిపాలన ఒకే చోట ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేది చంద్రబాబు నినాదమని వెల్లడించారు.

మూడేళ్లల్లో ఒక్క పరిశ్రమ తీసుకు వచ్చారా..? చిన్న జిల్లాలు చేస్తే అభివృద్ధి అవుతుందా..? తొంభై శాతం మంది పది ఫెయిల్ బ్యాచ్ ఉన్నారు.. వీళ్ళకి అవగాహన ఏమి ఉంటుంది..? అని ఫైర్ అయ్యారు.
తెలంగాణలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని.. గుర్తు చేశారు. పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేక.. ప్రజల చర్చ నుంచి డైవర్ట్ చేయడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందని.. కొత్త జిల్లాల వల్ల ఉపయోగం ఏంటి..? ఒక్క ఉద్యోగం అయినా వస్తుందా..? అని నిలదీశారు.

నవ రత్నాలు బ్రాండ్స్.. భారతి గోల్డ్, సాక్షి స్టేటస్, బూమ్ బూమ్ అని.. అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా లాంటివి, చంద్రబాబు పథకాలు వంద ఉన్నాయి.. అవి చంద్రబాబు బ్రాండ్స్.. అందుకే అవి మూశాడు అని అగ్రహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 శాతం బ్రాండ్స్ తెచ్చారు… వైసీపీ బ్రాండ్స్ కనుకే అవి మూయలేదు.. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news