జగన్ దొంగ ఓట్లతో గెలవాలని కుట్రలు చేస్తున్నారని ఓటర్ల జాబితాలో అవకతవకల మీద కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బిజెపి ఏపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. బిజెపి ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశం అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ మీద ఆమె దిశా నిర్దేశం చేశారు. మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారని అన్నారు. దొంగ ఓట్లు ఆధారంగానే జగన్ వై నాట్ 175 స్లోగన్ ఇచ్చినట్లు ఆమె విమర్శించారు. దొంగ ఓట్ల విషయం లో ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ చేయడం బిజెపి విజయమని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకు పూర్తిగా దూరం పెట్టాలని అన్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేక కూడా రాశామని అన్నారు ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా వైసిపి నేతలు దుర్వినియోగం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ పద్ధతిని కూడా బిజెపి ఆక్షేపిస్తుందని అన్నారు పురందేశ్వరి. ప్రలోభ పెట్టే వాళ్ళ మీద దృష్టి పెడుతున్నామని అన్నారు మోడీ చేసిన మంచి జగన్ చేసిన మోసాలు ప్రజలకి చెప్పమన్నారు.