జగన్ పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. అప్పులే మిగిల్చాడు !

-

విశాఖ: సిఎం జగన్ , వైసీపీ సర్కార్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్ అని.. జగన్ ను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోంది…భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకుని రావాలని చూడ్డం శోచనీయమన్నారు.

వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకుని అప్పులకు వెళుతోందని.. ఉన్న ఆస్తులను అమ్ముకో వడం చూస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని అర్ధం అవుతోందని ఫైర్ అయ్యారు. ఆరు లక్షల పై చిలుకు అప్పు భారం ప్రజలపై పడింది…కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా ఎక్కువ అప్పులు-తక్కువ అభివృద్ధి గా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అగ్రహించారు.

రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధిలోను కేంద్ర భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది…కేంద్రం వనరులు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు…ఎంపిలకే రక్షణ లేకుండాపోయిందని అగ్రహించారు. రాష్ట్ర రహదారులపై గుప్పెడు మట్టి కూడా ఈ ప్రభుత్వం వేయలేకపోతోంది….రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదనేది నిజం కాదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news