ఆ రాష్ట్రంలో గో మూత్రం, ఆవు పేడ కొనుగోలు

-

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఆవుల పేడ, గోమూత్రం కొనుగోలు చేయనుంది. అయితే ఆవు పేడను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ జాబితాలో గో మూత్రం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పశువుల పెంపకాన్ని పెంచడానికి, ఆర్థిక లాభదాయకంగా మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు, పశువుల యజమానుల నుంచి లీటర్ గో మూత్రానికి రూ.4 చెల్లించి కొనుగోలు చేసేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమైంది.

గోమూత్రం

పైలెట్ ప్రాజెక్ట్‌ లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం భూపేశ్ భఘేల్ సలహాదారుడు ప్రదీప్ శర్మ తెలిపారు. ఇప్పటికే ఆవు పేడను కిలోకు రూ.1.5 చెల్లించి సేకరిస్తోంది. ఈ ఆవు పేడను వర్మీకంపోస్ట్ చేస్తోంది. అలాగే గోమూత్రాన్ని సేంద్రీయ ఎరువులు, పురుగుల మందులు, ఫంగిసైడ్స్(శిలింధ్రాలు) తయారు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రసాయన ఎరువుల కంటే.. సేంద్రీయ ఎరవుల వాడకంతో వ్యవసాయం వృద్ధి చెందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version