షమ్నా ఖాసీమ్.. అలియాస్ పూర్ణ.. తెలుగు తెరపై తన అందాలను ఆరబోయడమే కాదు హార్రర్ మూవీ లతో ప్రేక్షకులను భయపెట్టించగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ ఈమె అని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూర్ణ బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఢీ డాన్స్ జోడితోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఇక ఇటీవల అఖండ సినిమాతో మళ్లీ వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా సినిమాలకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా మిగిలిపోయిన వారే ఉన్నారు. ఇక అలాంటి వారిలో ఆడవారు మాత్రం ఇప్పుడు ఒక్కొక్కరిగా వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే పూర్ణ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెళ్లికి సంబంధించిన డేటు కూడా ఫిక్స్ చేసినట్లు ఆ ముహూర్తపు రోజు కూడా బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ రోజూ కూడా తన పెళ్లి, ప్రేమ గురించి బయట పెట్టని పూర్ణ ఒకరోజు సోషల్ మీడియా ద్వారా తన కాబోయే భర్త షానిద్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఒక టీవీ షోలో పాల్గొన్న పూర్ణ నవంబర్ 6వ తేదీన వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. పెళ్లికి సంబంధించిన డేటు తో పాటు తమ రిలేషన్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంది. ఇకపోతే తనది ప్రేమ వివాహం కాదు అని పెద్దలు కుదిర్చిన వివాహమని పెళ్లయ్యాక షానిధ్ తో కలిసి దుబాయ్ లోనే స్థిరపడబోతున్నట్లు పూర్ణ వెల్లడించింది. షానిధ్ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఫౌండర్ గా దుబాయ్ లో వ్యవహరిస్తున్నాడు.