పుతిన్ వ‌ర్సెస్ బైడెన్ : సీన్ రివ‌ర్స్.. జో బైడెన్ పై ర‌ష్యా ఆంక్షలు

-

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం చేయ‌డంతో అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాలు ర‌ష్యా పై ఆంక్షలు విధిస్తున్నారు. ర‌ష్యాపై ఆంక్షలు విధించ‌డంలో అమెరికా ముందు ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. ర‌ష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పై ఆంక్షలు విధించారు. అంతే కాకుండా ర‌ష్యా పై కూడా ఆంక్షలు విధిస్తు.. ర‌ష్యా ఆర్థిక శ‌క్తిని ప‌డ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కాగ తాజా గా ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో ర‌ష్యా.. అమెరికాకు జ‌ల‌క్ ఇచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పై ర‌ష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప‌లు ఆంక్షలు విధించారు.

జో బైడెన్ తో పాటు అమెరికా మంత్రులు ఆంటోని బ్లింకెన్, ల‌యాడ్ ఆస్టిన్, సీఐఏ డైరెక్ట‌ర్ విలియ‌మ్ బ‌ర్న్స్ పై ర‌ష్యా ఆంక్షలు విధించింది. అంతే కాకుండా మ‌రో ప‌ది మంది అమెరిక‌న్ ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై కూడా ర‌ష్యా ఆంక్షలను విధించింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా.. ర‌ష్యాపై ఆంక్షలు విధించేంది.

కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. అమెరికా పైనే ర‌ష్యా ఆంక్షలు విధిస్తు మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. అయితే ర‌ష్యా .. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నా.. ఆంక్షల విషయంలో మాత్రం అమెరికా – ర‌ష్యా కాలు దువ్వుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news