పువ్వాడ వర్సెస్ పొంగులేటి..ఖమ్మంలో రచ్చ..జంపింగ్‌!

-

అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పెద్ద పంచాయితీ నడుస్తుంది..చాలా స్థానాల్లో ఎమ్మెల్యేలకు, నేతలకు పడని పరిస్తితి. ఇదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పంచాయితీ మరీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని వల్ల ఆధిపత్య పోరు తారస్థాయిలో కొనసాగుతుంది.

 

ఇదే సమయంలో జిల్లాలో ఇద్దరు సీనియర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి కనిపిస్తోంది. జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్..మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలకు పెద్దగా పడని పరిస్తితి. ఇరు వర్గాలకు ఎప్పటినుంచో వివాదాలు నడుస్తున్నాయి. ఇక సీటు విషయంలో ఇటీవల పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సైతం సంచలనంగా మారాయి. వైసీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన పొంగులేటికి గత ఎన్నికల్లో సీటు దక్కలేదు. పోనీ కేసీఆర్..ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ గాని ఇవ్వలేదు.

 

అయితే వచ్చే ఎన్నికల్లో పొంగులేటి సీటు ఆశిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో రిజర్వడ్ కానీ సీట్లు మూడు ఉన్నాయి. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం సీట్లు ఉన్నాయి. ఈ మూడిటిల్లో ఏదొక చోట పోటీ చేస్తానని పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు సీట్లు ఖాళీ లేవు. పైగా ఖమ్మంలో మంత్రి అజయ్ ఉన్నారు. పైగా ఇటీవల పొంగులేటి..మా టీం ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయిందని కామెంట్ చేశారు.

ఇక పరోక్షంగా గంగిరెద్దు వాళ్ళు వస్తున్నారని అజయ్ కామెంట్ చేశారు. పైగా ఇటీవల పొంగులేటి బ్యానర్లని మంత్రి అజయ్ వర్గం వాళ్ళు చింపేశారు. దీంతో పొంగులేటి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీటు దక్కకపోతే..బీజేపీలోకి జంప్ చేసేందుకు పొంగులేటి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఎటు చూసుకున్న ఖమ్మంలో కారుకే డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news