క్వీన్ ఎలిజబెత్ II పరిచయం అక్కర్లేని పేరు..దివంగత క్వీన్ ఎలిజబెత్ IIకి ఇష్టమైన ఆభరణాలలో ఒకటైన వజ్రాన్ని వేలంలో వేయగా రికార్టు స్థాయిలో విక్రయించారు.. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వజ్రంలో అంత ప్రత్యేకత ఏముందని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.
క్వీన్ ఎలిజబెత్ IIకి ఇష్టమైన పింక్ డైమండ్ 453 మిలియన్ హాంకాంగ్ డాలర్లకు ($57 మిలియన్లు) అమ్ముడైంది. ఈ వజ్రం క్యారెట్ ధర ఇప్పటివరకు ఏ వేలంలోనూ విక్రయించబడని సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. డైమాండ్ క్యారెట్‌కు అత్యధిక ధర.11.15 క్యారెట్ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ హాంకాంగ్‌లో సోత్‌బైస్ అమ్మకానికి కొత్త రికార్డు సృష్టించింది.
1953లో కార్టియర్‌కు చెందిన ఫ్రెడరిక్ మేవ్ రూపొందించిన ఈ వజ్రాభరణం దివంగత క్వీన్ ఎలిజబెత్ IIకి ఇష్టమైన ఆభరణాలలో ఒకటి. క్వీన్ ఎలిజబెత్ II ఆమె సిల్వర్ జూబ్లీ వేడుకలతో సహా అనేక సందర్భాలలో ఆభరణాన్ని ధరించారు. ఈ పింక్ వజ్రం..453 మిలియన్ హాంకాంగ్ డాలర్లకు ($57 మిలియన్లు) విక్రయించబడింది. దాని అంచనా ధర కంటే రెండు రెట్లు ఎక్కువ ధరతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
11.15 క్యారెట్ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ కొనుగోలుదారు పేరు ప్రకటించలేదు. ఈ ఆభరణం కుషన్ ఆకారంలో రెండు పెద్ద గులాబీ వజ్రాలతో ఉంటుంది. వాటిలో ఒకటి 59.60 క్యారెట్లు. విలియమ్సన్ స్టోన్, 23.60 క్యారెట్ డైమండ్ క్వీన్ ఎలిజబెత్ IIకి వివాహ బహుమతిగా ఇవ్వబడింది.
పింక్ వజ్రాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ వజ్రం వేలంలో విక్రయించబడిన రెండవ అతిపెద్ద గులాబీ వజ్రం. పింక్ వజ్రాలు విలువైన రత్నాలలో అత్యంత అరుదైనవి. గ్లోబల్ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్నవి కూడా. అవి గులాబీ రంగులోకి మారడానికి కారణం ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు..
1953లో, కార్టియర్ ఫ్రెడెరిక్ మ్యూ పుష్పాకారపు బ్రూచ్ డైమండ్ ఆభరణాన్ని రూపొందించారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆర్గైల్ అనేది పశ్చిమ ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న వజ్రాల గని.. ఇక్కడ అరుదైన వజ్రాలు ఉన్నాయి.. ఈ గని 37 ఏళ్ల ఆపరేషన్ తర్వాత 2020లో మూసివేయబడింది. పింక్ డైమండ్స్ ఇకపై దొరుకుతాయో లేదో కూడా తెలియదు.