రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబే – మంత్రి కారుమూరి

-

రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబే అని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. శనివారం వికేంద్రీకరణకు మద్దతుగా తనుకు నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు మనల్ని తాకట్టు పెట్టాడని అన్నారు. తన స్వార్థం కోసం అసైన్డ్ భూముల చట్టాన్ని కూడా మార్చారని మండిపడ్డారు. అమరావతి పేరుతో చంద్రబాబు బినామీల రాజధాని కట్టాలని చూశారని ఆరోపించారు.

నూజివీడులో రాజధాని వస్తుందని నమ్మి భూములు కొన్న చాలామంది రైతులు చనిపోయారని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. అందులో అమరావతి ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం అన్నారు మంత్రి కారుమూరి. 29 గ్రామాలకు ప్రజల కోసం మూడు ప్రాంతాల ప్రజలు మోసపోవాలా? అని ప్రశ్నించారు. 29 గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కాదన్నారు. భూములు ఇవ్వమన్న రైతులకు సిపిఎం, సిపిఐ, జనసేన అప్పుడు మద్దతుగా నిలిచి ఇప్పుడు మాట మార్చాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news