మునుగోడులో కేసీఆర్ సభ ఉంటుందన్నారు R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం దేవలమ్మ నాగారంలో R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు ఎన్నికలు కేవలం కాంట్రాక్టు కోసం వచ్చాయి తప్ప అభివృద్ధి కోసం కాదు.. రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ప్రతి ఒక్క తెరాస కార్యకర్త కసిగా ఉన్నారన్నారు.
ఒక్క రోజు కూడా గ్రామాల్లో తిరగలేదు గెలిచాక ఇతర దేశాల్లో విలాసంగా తిరగడం ప్రజలు గమనించారు… దేశంలోనే తెలంగాణా రోల్ మోడల్ గా మారిందని చెప్పారు. ఇది గమనించిన బిజెపి తెలంగాణా లో బిజేపి ఆటలు సాగవని మునుగోడు ఉప ఎన్నికలను తెరపైకి తెచ్చారు.. ఒక్క పని కూడా చేయని బిజెపి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని వెల్లడించారు. ప్రతి సామాన్యుని బ్యాంకు ఖాతాలో 15 లక్షలు ఇస్తానన్న మోడీ ఇవ్వకపోగా తన దోస్తులకు మాత్రం12 లక్షల కోట్లు మాఫీ చేసి భారీగా కమిషన్ తీసుకున్నారని ఫైర్ అయ్యారు. రాజా గోపాల్ రెడ్డి కి డిపాజిట్ కూడా దక్కదు.. Kcr దేశ నాయకుడు కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు తొందరలోనే మంచి రోజులు వస్తాయన్నారు.