ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నా ?: హీరో మాధవన్

-

తమిళ హీరో ఒకప్పుడు చెలి సఖి సినిమాలతో యువతలో విపరీతమైన క్రెజ్ ను దక్కించుకున్నాడు ఆర్ మాధవన్. ఇప్పటికీ అప్పుడప్పుడు అతిధి పాత్రలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా మాధవన్ నటించిన ది రైల్వేమెన్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక కీలక విషయాన్ని పంచుకున్నాడు. మాధవన్ మాట్లాడుతూ అప్పట్లో హీరోయిన్ జుహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు ఇంటర్వ్యూ లో ప్రస్తావించడం జరిగింది. జుహీ చావాలా అప్పట్లో నటించిన “ఖయామత్ సె ఖయామత్ తక్” సినిమా చూసి ఫిదా అయ్యానని మాధవన్ చెప్పడం విశేషం. జుహీ చావ్లాను పెళ్లి చేసుకుంటానని మా అమ్మతో కూడా చెప్పానని మాధవన్ ఓపెన్ అయ్యాడు. కానీ నా కోరిక తీరలేదంటూ బాధపడ్డాడు మాధవన్.

కొన్ని సార్లు అంతే చాలా అనుకుంటాము కానీ దేవుడు మనల్ని ఎలా వెళ్ళమంటే అలా వెళ్లాల్సిందే అంటూ నెటిజన్లు మాధవన్ కోరిక తీరకపోవడంపై కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version