ఆస్తి తగాదాలతో మావద్దకు రాకండి.. సీపీ మహేష్ భగవత్.

-

ఆస్తి తగాదాలతో మా వద్దకు రాకండి, సివిల్ అంశాల్లో జోక్యం చేసుకోబోమని అన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.ఖాళీ స్థలాలు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు.రాత్రి వేళల్లో కొందరు జెసిబి లతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.మంగళవారం నేరేడ్ మెట్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

స్థలాలు కొనుగోలు చేస్తున్న వారు ఖచ్చితంగా 30ఏళ్ల లీగల్ సెర్చ్ డాక్యుమెంట్లు చూసుకోవాలని, ధరలు పెరుగుతుండటంతో డబుల్ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని కొనుగోలు చేసే సమయంలో వాటికి సంబంధించిన వివరాలను సబ్ రిజిస్టార్, రెవెన్యూ శాఖలో తనిఖీ చేసుకోవాలన్నారు.కొందరు సివిల్ వివాదాన్ని క్రిమినల్ అంశంగా మార్చి ఫిర్యాదులను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.పోలీస్ స్టేషన్లలో ల్యాండ్ పంచాయతీలు చేయమని, పోలీసులు ఎవరైనా అనవసరంగా భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version