మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్..తొలి చిత్రంతోనే స్టార్ అయిపోయాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంతో స్టార్ అయిపోయాడు. కాగా, ఆ తర్వాత వచ్చిన చిత్రం ‘కొండ పొలం’ మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఈ సినిమా విషయమై వైష్ణవ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఓబులమ్మ’గా రకుల్ ఇందులో కనిపించగా, రవీంద్రగా వైష్ణవ్ తేజ్ నటించారు. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథలో తర్వాత మార్పులు జరిగినట్లు వైష్ణవ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
క్రిష్ తనకు తొలుత చెప్పిన ‘కొండ పొలం’ కథకు..మేకింగ్ లో మార్పులు జరిగాయని తెలిపారు. అలా జరుగుతున్న క్రమంలోనే తనకు ఎందుకో సినిమా వర్కవుట్ కాదేమోనని అనిపించిందని వైష్ణవ్ తేజ్ అన్నారు. అలా ‘కొండ పొలం’ సినిమా ఫెయిల్యూర్ గురించి తను ముందుగానే గెస్ చేశానని వైష్ణవ్ తేజ్ చెప్పకనే చెప్పేశారు.
క్రిష్ దర్శకత్వంలో తను నటించడం నచ్చిందని వైష్ణవ్ తెలిపాడు. క్రిష్ మేకింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని వైష్ణవ్ చెప్పాడు.
అయితే, ‘కొండ పొలం’ ఫిల్మ్..లో వైష్ణవ్ తేజ్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. కానీ, సినిమా పరంగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం విడుదలైంది. అయితే, ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది.