స్పీకర్ గారు ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలా మారారు: రఘునందన్ రావు

-

సభాపతిగా శాసన సభ్యుల హక్కుల్ని కాపాడాలని సభాపతిని కోరుతున్నామని.. నిన్న స్పీకర్ ప్రవర్తించిన తీరు కీలు బొమ్మలా ఉందని… ముఖ్యమంత్రి ఏం చెబితే అదే చేస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. మా గౌరవ మర్యాదల్ని మంటగలపాలని, నిరసన తెలిపే హక్కుని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చేసింది తప్పైతే.. మమ్మల్ని పిలిస్తే సంజాయిషీ ఇస్తామన్నారు. నిన్న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్… బడ్జెట్ ప్రసంగంలా లేదని.. రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు. ఇది బడ్జెట్ స్పీచని హరీష్ రావు భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు. సమాజంలో మీ తప్పుల్ని ఎండగడుతామని భయంతోనే మమ్మల్ని సస్పెండ్ చేశారు. మేం మాట్లాడితే.. వినే ఓపిక లేదని అన్నారు. ఉన్న మూడు పార్టీల్లో మమ్మల్ని సస్పెండ్ చేశారు… కాంగ్రెస్ వారు బయటకి వచ్చారని అసలు మీరు బడ్జెట్ ఎవరికి చెప్పారని ప్రశ్నించారు. దీనికి అసెంబ్లీ ఎందుకని.. ప్రగతి భవన్ లో చెబితే సరిపోయేది కాదా.. అని ఎద్దేవా చేశారు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ఇలా చేశారని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన తెలిపితే… పార్లమెంట్ స్పీకర్ అనుమతించారని ఆయన అన్నారు. మీలా సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. గతంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఉమ్మడి ఏపీ శాసనసభలో స్పీకర్ పైనే కాగితాలు చింపి విసిరేశారని గుర్తు చేశారు. మా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్ట్ ని ఆశ్రయించామని రఘునందన్ రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news