విజయసాయి రెడ్డి శకుని లాంటోడు : వైసీపీ రెబల్‌ ఎంపీ

ఢిల్లీ : రామాయణంలో మందర, శకుని పాత్ర విజయసాయి రెడ్డిదని…త్వరలోనే ఆయన అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడమో చూడాలని ఎద్దేవా చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. విజయసాయి రెడ్డి వ్యక్తిత్వం దొంగలెక్కలు వేయటంలో ఘనాపాటి అని… 16 నెలలు జైలులో ఉన్న విజయసాయి రెడ్డి స్థాయి నాది కాదు..అది నా క్యారెక్టర్ కాదని చురకలు అంటించారు.

మెడలు వంచుతా అని కాళ్ళు పట్టుకునే వ్యక్తిత్వ నాది కాదని.. గురుగింజ కింద కన్నా దారుణమైన వ్యక్తిత్వం విజయసాయి రెడ్డిది మండిపడ్డారు. వ్యక్తిత్వం, స్థాయి గారించి మాట్లాడే అర్హత విజయసాయి రెడ్డి కి లేదని… మందర, శకుని అలియాస్ విజయసాయి రెడ్డి అని చురకలు అంటించారు. ఎవరిది ఏ కులం, స్థాయి, వ్యక్తిత్వం పై చర్చకు సిద్దమని పేర్కొన్న రఘురామ కృష్ణరాజు… ఏమీ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అనేది జగన్, విజయ సాయి రెడ్డి ఆలోచించుకొని మాట్లాడాలన్నారు.

124 ఏ సెక్షన్ పై సుప్రీం కోర్టు లో జరిగిన విచారణ, చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యాలు ఆహ్వా నించదగినవని తెలిపారు. ముస్సో లిని, హిట్లర్ మించిన పాలన కొన్ని చోట్ల సాగుతున్నట్లు ప్రజలు భావిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యాలు కీలకమైనవని… న్యాయస్థానా లు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం లో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. తన అనర్హత గురించి మాట్లాడేవారు 10 వ షెడ్యుల్ ఒక సారి చదవాలని.. తలకాయ ఉన్నవాడిని ఒక్కడిని పెట్టుకోమని జగన్ గారికి సూచిస్తున్నా నని పేర్కొన్నారు.