ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ

-

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల పై గెజిట్ విడుదల పై ఈ సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలిపారు రఘురామ. షెడ్యూల్ 9,లో 107 ఇన్సిస్టుషన్‌, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్ లో ఉన్నాయని… 7 ఏళ్ళు అయిన ఇంకా వాటి విభజన జరగలేదు వాటి పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు రఘురామ.

జల వివాదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గెజిట్ ఇచ్చినందుకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ ధన్యవాదాలు తెలిపారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాల పై కేంద్రం త్వరగా జోక్యం చేసుకోవాలని.. తెలుగు భాష పై లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ సరికాదన్నారు. రెండు అకాడమీలను కలపడం పై భాషాభిమానుల ఆవేదన అరణ్యరోదన అవుతుందని తెలిపారు. సంస్కృత అకాడమీలో తెలుగు అకాడమీని కలపడం బాధాకరమని… ప్రాచుర్యం కలిగిన తెలుగు అకాడమీ పై ఫోకస్ చేయడం లేదని మండిపడ్డారు.

తెలుగు అకాడమీ లో దాదాపు 200 వందల కోట్ల రూపాయలు ఉన్నాయని…ముందు వాటిని సెటిల్ చేయాలని తెలిపారు. పేక ముక్కలతో తెలుగు భాషను పోల్చడం పదం సరైంది కాదని… లక్ష్మీపార్వతి స్టేట్మెంట్ కేవలం జూదరులకు తప్ప ఇంకా ఎవరికి నచ్చదని చురకలు అంటించారు. సీపీఐ నారాయణను తాను అత్యంత గౌరవిస్తానని..తనను ఆయన పరామర్శించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news