రాహుల్ గాంధీ ఐరన్ లెగ్గు… ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఖతం: హరీష్ రావు

-

కాంగ్రెస్ హయాంలో కరెంట్ సరిగ్గా ఉండలేదని… రైతులకు ఎరువులు అందుబాటులో ఉండలేదని, రైతులు ఎరువులు కోసం క్యూలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే టాన్ఫార్మర్లు ఇలా వారి పాలన ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదని.. నీళ్లు ఇచ్చింది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లే మంచిగా లేదని.. కానీ తెలంగాణను ఉద్దరిస్తారా..? అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అడుగు పెడితే ఐరన్ లెగ్గే అని, ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఓడిపోవడమే అంటూ విమర్శించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఓడింది 94 శాతం, గెలిచింది 6 శాతమే అని అన్నారు. ఉన్న పంజాబ్ ఊడగొట్టుకున్నారని.. ఢిల్లీలో, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో పత్తా లేకుండా పోతుందని విమర్శించారు. కాంగ్రెస్ అనేది గతమని.. మీది ఒడిసిన చరిత్ర అంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ వాళ్లు నల్ల చట్టాలు, బాయిల దగ్గర మీటర్లు పెట్టడం తప్పా మీరు రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. దొడ్డు వడ్లను కొనమని చెప్పినా.. మా రైతులు ఓడిపోకుండా రూ. 3000 కోట్లతో ధాన్యాన్ని కొంటున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news