వరి ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. రాహుల్ గాంధీ పెట్టిన ట్విట్ పై ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావులు స్పందించారు. రాహుల్ గాంధీకి కౌంటర్ గా ట్విట్లు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ నేతల ట్విట్లపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
తాజాగా మంత్రి హారీష్ రావు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. ‘‘ తెలంగాణ పై దొంగ ప్రేమ, మొసలి కన్నీల్లు ఆపండి రాహుల్ గాంధీ గారు.. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్ లో మా ఎంపిలతో కలిసి మీరు ఆందోళన చేయండి రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పై మీ పార్టీ స్టాండ్ ఏంటో ముందు చెప్పండి. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోకండి.’’ అంటూ ట్విట్ చేశారు.
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని.. చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలుగులో ట్విట్ చేశారు.
తెలంగాణ పై దొంగ ప్రేమ, మొసలి కన్నీల్లు ఆపండి రాహుల్ గాంధీ గారు..
తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్ లో మా ఎంపిలతో కలిసి మీరు ఆందోళన చేయండి
రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి. https://t.co/ie53QrrW1m— Harish Rao Thanneeru (@trsharish) March 29, 2022