టీఆర్ఎస్ పది పైసల పనులు చేసి… వంద రూపాయల ప్రచారం చేసుకుంటోంది: జగ్గారెడ్డి

-

టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏం చేసిందని ప్రశ్నిస్తుందని… ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. టీఆర్ఎస్ పది పైసల పనులు చేసి వంద రూపాయల ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీది గ్రాఫిక్స్ పాలన అని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే రాహుల్ గాంధీ తెలంగాణ వస్తున్నారని ఆయన అన్నారు. ఓయూ పర్యటన గురించి కార్యాచరణ ఉంటుందని ఆయన అన్నారు. రైతులను ముంచడంలో కేసీఆర్, మోదీ అన్నదమ్ములే అంటూ విమర్శించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పర్యటను వ్యతిరేఖిస్తూ.. టీఆర్ఎస్పీ ఓయూలో ఆందోళన చేపట్టింది. ఓయూలో రాహుల్ అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించింది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు టీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news