ఢిల్లీ వేదికగా గత మూడు రోజుల నుండి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ చర్చ లు సాగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో రాహుల్ గాంధీ పార్టీ నేతలకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఈయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎవరు ఏమి చేశారో ? ఏమి చేస్తున్నారో ? మాకు తెలుసని అన్నాడు. ఇంకా రాహుల్ మాట్లాడుతూ పార్టీలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే రాష్ట్ర ఇంచార్జి కు లేదా నాతో చెప్పుకోవాలని కానీ… బయట ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడవద్దని అందరికీ స్ట్రాంగ్ గా చెప్పాడు. పార్టీలో ఉన్న నేత ఎవరైనా సరే నియమాలను ఉల్లఘించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని రాహుల్ అన్నారు. ఇక ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక లో తుది నిర్ణయం అధిష్ఠానిదే అంటూ చురక అంటించారు రాహుల్.
ముందు అందరూ కలిసి పార్టీని ఐక్యంగా నడిపించి.. తర్వాత మీరు మీరు కొట్టుకోండంటూ మాట్లాడారు రాహుల్.