కుంభమేళా తరహాలోనే సమక్క-సారలమ్మ జాతరను అధికారిక జాతీయ ఉత్సవంగా నిర్వహిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదివాసుల కోసం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తాం. అభివృద్ధి గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. పోడు భూములపై ఆదివాసీలకు హక్కుల కల్పిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీల బిల్లు ఆమోదించాం. కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నిలబెట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. కరెంట్ బిల్లుల్లో 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛన్ ఇస్తాం. యువతీ యువకులకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. సమ్మక్క-సారలమ్మ ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేస్తాం. కుంభమేళా తరహాలో చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. రూ.లక్ష రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. రాజస్థాన్ లో రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దేశంలో ఉచిత వైద్య సేవలు అందిస్తుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో మాత్రమే. ఛత్తీస్ ఘడ్ లో రైతుల వద్ద మద్దతు ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. అని రాహుల్ వ్యాఖ్యానించారు.