రెయిన్ అలెర్ట్… మరో గంటలో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు

-

తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాములు తెలంగాణలో హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. ఉరుములు, మెరుపులతో జల్లులు కురిశాయి. తాజాగా మరో గంటలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

బుధవారం తెల్లవారుజామును కరిసిన వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో పాటు పలు జిల్లాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయాయి. అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ మీద ఉపరితల ద్రోణి ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news